BREAKING
బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం

Select Suryaa Now
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం

​పార్వతీపురం, అక్టోబర్ 27: మేజర్ న్యూస్ :;అర్నబ్' తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరికల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి వివిధ శాఖల అధికారులతో మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో చేపట్టవలసిన ముందస్తు రక్షణ చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు అందజేశారు. తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. తుఫాన్ సమయంలో మరియు ఆ తర్వాత చేపట్టాల్సిన విపత్తు నిర్వహణ కార్యక్రమాలపై సంబంధిత శాఖలు తక్షణమే తగిన ప్రణాళికలు రూపొందించుకొని, క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, విద్యుత్, తాగునీరు, వైద్యం తదితర అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ తదితర అన్ని శాఖల మధ్య సరైన సమన్వయం ఉండాలని పేర్కొన్న ఆయన, జిల్లా విపత్తు నివారణా అధికారికి హైడ్రాలిక్ మిషన్ తెప్పించి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం మరియు సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ జూమ్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు సచిన్ అర్చిత రహార్, పవార్ స్వప్నిల్ జగన్నాధ్, డి.ఆర్.ఓ కె. హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. విజయలక్ష్మి, డ్వామా పి.డి. రామచంద్రరావు, డి.ఆర్.డి.ఎ పి.డి. ప్రభావతి, జెడ్.పి. సి.ఇ.ఓ సుధాకర్, ఐ.సి.డి.ఎస్ పి.డి. కనకదుర్గ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సింహాచలం, జిల్లా వ్యవసాయ అధికారి భవానీ శంకర, డి.ఎస్.ఓ అశోక్, ఎ.పి.ఇ.పి.డి.సి.ఎల్ ఎస్.ఇ. త్రినాధ్ రావు తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.