BREAKING
16వ డివిజన్ కార్పొరేటర్‌గా నాగభూషణంను గెలిపించండి: ఇన్‌స్టాకార్ట్ కొనుగోలు అత్యంత ఖరీదైన నిర్ణయం కాగలదన్న నిపుణులు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పిల్లల మెదడులో తీవ్ర మార్పులు.. నిపుణుల తాజా అధ్యయనంలో సంచలన విషయాలు అర్నబ్ తుఫాన్ బీభత్సం: ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో భీకర గాలులు, నేలకూలిన చెట్లు.. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్! దేశబహిష్కరణ కేసులను నిలిపివేసే అధికారం ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులకు లేదని స్పష్టీకరణ డివిజన్ కార్పొరేటర్‌గా ఒక అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం – టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ బాషా చలికాలంలో పెరుగు తింటే నిజంగానే జలుబు చేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఐరోపాతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న సఫ్రాన్ సీఈఓ అధికారంలోకి వస్తే 'కృత్రిమ మేధస్సు' అనే పదాన్ని నిషేధిస్తానన్న ట్రంప్ తిరుపతిలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం. చిత్తూరు శంకర్ న్యాయమూర్తులు, అధికారుల చిరునామాల గోప్యతా చట్టం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి పాడేరు ఏజెన్సీ పరిధిలోని 3 ఘాట్ రోడ్లలో రాకపోకలు బంద్! రామగిరి మండలం లో 10 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం... ఎన్నికల రిటర్నింగ్ అధికారి కవిత కాకినాడ దిశగా పయనం..యానాం వద్ద తీరం దాటే అవకాశం.. 150 కి.మీ. వేగంతో భీకర గాలులు..తీరప్రాంతాల్లో భారీ వర్షాలు మీ ఇంటి ఆడబిడ్డ లు ఆదరించండి. గెలిపిస్తే అందుబాటులో ఉంటా. షాహిన

వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి

Select Suryaa Now
వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి

 

పాచిపెంట, అక్టోబర్ 27, మేజర్ న్యూస్:;వైయస్సార్ పార్టీ అడ్వైజర్ కమిటీ మెంబర్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర ఆశీస్సులు మేరకు పాచిపెంట మండల ఎంపీపీ అభ్యర్థిగా డోల బాబ్జి(తాను), జడ్పిటీసీ అభ్యర్థిగా కలువులపల్లి పుష్ఫ పోటీలో ఉన్నారని వారిని మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైసిపి ఎంపీపీ అభ్యర్థి డోల బాబ్జి మండల ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ అభ్యర్థితో పాటు 14 మంది ఎంపీటీసీలు అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరంతా కష్టపడితే గెలుపు సాధ్యపడుతుందని, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గట్టాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. మన పార్టీ అధినేత  వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం మేరకు అన్ని ఎంపీటీసీ సెగ్మెంట్లలో అభ్యర్థులను పోటీలో నిలబెట్టాలనేదే ఆయన ఆశయమని అందుకే మనమంతా కష్టపడి ఓటర్ల వద్దకు వెళ్లి వారి మనసు చూరగొని మరో రెండేళ్లలో మన పార్టీ అధికారంలోకి వస్తే మండలంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని తెలిపారు. జడ్పిటిసి అభ్యర్థిగా పుష్ప, పాంచాలి పెద్ద గ్రామంలో పోటీ చేయడము అత్యంత శుభ సూచికమని మనమంతా తెలుగు దేశం ఎంపీటీసీ అభ్యర్థులుపై గెలుపొంది మన మండల అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బాబ్జి కోరారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ళు దాటినా ప్రజలకు ఉపయోగము లేదని అందుకే మనమంతా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమికి నడుం కట్టాలన్నారు.పాచి పెంట మండలం వైయస్సార్ పార్టీకి కంచు కోట అన్నారు. ప్రతీ ఇంటికి ప్రతీ గడపకి వెళ్లి ఓటర్లను కలిసి ఓటు అడగాలని అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామని చెప్పాలని ఎంపీటీసీ అభ్యర్థులకు బాబ్జి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు గొట్టాపు ముత్యాలు నాయుడు,వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దిబాబు, మాజీ వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరీశ్వరరావు, మర్రి ఉమామహేశ్వరరావు, పాచిపెంట టౌను ప్రెసిడెంట్ మజ్జి వెంకట్రావు, దండి ఈశ్వరరావు, పాచిపెంట శ్రీనివాసరావు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు హాజరయ్యారు.