BREAKING
అధికారంలోకి వస్తే 'కృత్రిమ మేధస్సు' అనే పదాన్ని నిషేధిస్తానన్న ట్రంప్ తిరుపతిలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం. చిత్తూరు శంకర్ న్యాయమూర్తులు, అధికారుల చిరునామాల గోప్యతా చట్టం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి పాడేరు ఏజెన్సీ పరిధిలోని 3 ఘాట్ రోడ్లలో రాకపోకలు బంద్! రామగిరి మండలం లో 10 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం... ఎన్నికల రిటర్నింగ్ అధికారి కవిత కాకినాడ దిశగా పయనం..యానాం వద్ద తీరం దాటే అవకాశం.. 150 కి.మీ. వేగంతో భీకర గాలులు..తీరప్రాంతాల్లో భారీ వర్షాలు మీ ఇంటి ఆడబిడ్డ లు ఆదరించండి. గెలిపిస్తే అందుబాటులో ఉంటా. షాహిన 39 వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న పింకీ జైన్ ... కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శవంతమైన డివిజన్ గా చేస్తా.... జొన్న రొట్టె తింటున్నారా.. మీ ఆహారంలో ఈ సిరిధాన్యాన్ని చేర్చుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే చైనాలో పేలిన ఏఐ బుడగ? నాలుగు నెలల్లో 40% పతనమైన స్టార్‌50 మా అమ్మను 13 వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిపించండి.. డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం: టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొట్టే హేమంత్ రాయల్ కూటమిలో యాదవులకు పెద్దపీట -యాదవులను రబ్బర్ స్టాంప్ లా వాడుకున్న వైసీపీ -నేను యాదవులతో కలిసి పెరిగాను-నాపై అసత్య ప్రచారం దారుణం -14 మంది యాదవులకు కార్పొరేటర్ టికెట్లు ఇచ్చిన ఘనత టిడిపిది -కూటమి అభ్యర్థులను గెలిపించండి: మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సంతానోత్పత్తిలో విటమిన్ డి పాత్ర ఎంత కీలకం.. ఈ లోపం ఉంటే గర్భధారణలో సమస్యలు తప్పవు 19 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆనంద్ బాబు యాదవ్ ను గెలిపించుకుందాం.. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి చిన్న వయసులోనే విపరీతంగా జుట్టు రాలుతోందా.. ఈ పొరపాట్లు మానుకుంటే హెయిర్ లాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు

కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా

Select Suryaa Now
కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంభారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక కార్యాలయంలో 24/7 ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంను మంగళవారం రాత్రి ఆయన పరిశీలించారు. తుఫాన్ కారణంగా ఎటువంటి సమస్య ఎదురైనా ప్రజలు 9494060060 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సిబ్బంది వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. వర్ష తీవ్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను మూడు షిఫ్టులలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉంటూ.. క్షేత్రస్థాయిలో  పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం జరుగుతుందన్నారు. తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుఫాన్ ప్రభావం తగ్గి వాతావరణం ప్రశాంతంగా మారే వరకు ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దని, దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.