తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
గరుగుబిల్లి, అక్టోబర్ 27, మేజర్ న్యూస్:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోని ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంగ న్వాడి సిబ్బంది అప్రమత్తంగా ఉండా లని కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణకుమారి తెలిపారు.ఈమేరకు మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తు న్నందున అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు భద్రతకు,ఆరోగ్యం మరి యు సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు,గర్భిణీలు మరియు బాలింతల భద్రతను నిరంతరం పర్యవే క్షించాలని చెప్పారు.ప్రసవ తేదీ దగ్గర లో ఉన్న గర్భిణీలను ముందుగానే గుర్తించి ఒక వారం ముందే సమీప ఆసుపత్రులకు తరలించాలన్నారు. అంగన్వాడీ కేంద్రం పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచే ప్రదేశాలు, చెరు వులు,కాలువలు, వాగులు,గుంతలు మరియు ఇతర ప్రమాదకర ప్రాంతాల వద్దకు చిన్నారులు వెళ్లకుండా జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు.అంగన్వాడీ కేంద్ర భవనం, పైకప్పు, గోడలు, తలుపులు,కిటికీలు, విద్యుత్ సౌక ర్యాలు, తాగు నీటి వసతి మరియు మరుగుదొడ్లను ముందస్తుగా తనిఖీ చేయాల్సి ఉంద న్నారు.పాత లేదా ప్రమాదకరమైన భవనాలు, కూలిపో యే అవకాశం ఉన్న గోడలు,చెట్లు, విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లకు చిన్నారులను దూరంగా ఉంచాలన్నారు.అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పోషకాహార పదార్థాలు, గుడ్లు, పాలు మరియు ఇతర ఆహార పదార్థాలను తడవకుండా,సురక్షిత మైన ప్రదేశంలో భద్రపరచాలని పి.ఓ సుగుణకుమారి చెప్పారు.గర్భిణీలు మరియు బాలింతలకు వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించి, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా ఉండేలా సూచనలు ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ, వాతావరణ పరిస్థితులు తీవ్రమైనప్పుడు పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి తీసుకురావడం/తిరిగి ఇంటికి పంపించడం వంటి అంశాల్లో స్థానిక అధికారుల సూచనలను పాటించాలన్నారు.భారీ వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అంగన్వాడి సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని పీవో సుగుణకుమారి పేర్కొన్నారు.