జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఎస్ జి ఎఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోఅండర్- 14, 17, 19లో శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా బాల,బలికులకు స్విమ్మింగ్ జిల్లా ఎంపిక పోటీలు ప్రారంభించారు. మంగళవారం జరిగిన కార్యక్రమానికి స్కూల్ గేమ్స్ సెక్రటరీ లోకనాథం అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 150 మంది బాలబాలికలు పాల్గొన్నారు. అండర్ 19 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 36 మంది విద్యార్థులను ఎంపిక చేసి నవంబర్ కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. అండర్-14, 17 విభాగాలలో విద్యార్థులు నవంబర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు. అనంతరం ముగింపు కార్యక్రమంలో జిల్లా డిఎస్డివో శశిధర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాను రాష్ట్రస్థాయి పోటీలలో ఓవరాల్ ఛాంపియన్ షిప్ తీసుకురావాలని ఆకాంక్షించారు. స్విమ్మింగ్ ద్వారా క్రీడాకారులకు శారీరక మానసికంగా ఎంతో ఉపయోగమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ సాంబశివరావు, స్విమ్మింగ్ కోచ్ ఆది, ఫిజికల్ డైరెక్టర్ విజయకుమారి, శకుంతల, శిరాజ్, ఆన్సర్ బాషా పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్