వి బి జి రామ్ పనులపై శిక్షణ......
మద్దూర్ .…మద్దూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మేట్ సభ్యులకు పథకంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలో ఎల్నినో ప్రభావం వల్ల కూలీలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని దీంతో ప్రతి కుటుంబానికి 125 రోజులు బీబీజీరాం పథక కింద పనులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య పెంచేందుకు గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని తమ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏపీవో మంజులా రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ లు వి రమేష్ ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.