BREAKING
మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి

జల సంరక్షణపై విద్యార్థుల బృహత్తర కార్యక్రమం*

Select Suryaa Now
జల సంరక్షణపై విద్యార్థుల బృహత్తర కార్యక్రమం*

 

*•189 పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులతో ప్రాజెక్టు వర్క్‌*

*•ఇంకుడు గుంతల పరిశీలన.. నీటి పొదుపుపై గ్రామస్థులకు అవగాహన*

*యాదాద్రిభువనగిరి,ప్రతినిధి మేజర్ న్యూస్*
ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతపై ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు జల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా 189 పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులతో బుధవారం ప్రత్యేక ప్రాజెక్టు వర్క్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని ఇంకుడు గుంతలను పరిశీలించి, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, నీటి పొదుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను బృందాలుగా విభజించి, ఒక్కో బృందానికి ఉపాధ్యాయుడిని కేటాయించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల సంఖ్య, వాటి పనితీరు, నిర్వహణ తీరు, మరమ్మతులు అవసరమైన గుంతల వివరాలను సేకరించారు. వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చేపడుతున్నారనే అంశాన్ని కూడా పరిశీలించారు.గ్రామాల్లో నీటి వినియోగం, అందుబాటులో ఉన్న నీటి వనరులు, అవసరాలను తీర్చేందుకు అనుసరిస్తున్న విధానాలపై విద్యార్థులు వివరాలు సేకరించారు. నీటిని వృథా చేయకుండా వినియోగించడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, ఇంకుడు గుంతలను సక్రమంగా నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామస్థులకు వివరించారు. విద్యుత్‌ పొదుపు, నీటి వనరుల సంరక్షణపైనా అవగాహన కల్పించారు.విద్యార్థులు క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలతో నివేదికలు రూపొందించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, సెక్టోరియల్‌ అధికారులు కార్యక్రమాన్ని సమన్వయం చేయగా.. గ్రామ కార్యదర్శులు సహకరించారు.
*జల సంరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం*
భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ కీలకమని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులను జల సంరక్షణ రాయబారులుగా తీర్చిదిద్ది, వారి ద్వారా కుటుంబ సభ్యులు, గ్రామస్థుల్లో నీటి పొదుపుపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.