BREAKING
చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు ఉచిత భోజనం అందించాలి ప్రతిరోజూ పండ్లు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం

బెల్ట్ షాపుల నిర్వహణపై సర్పంచ్ ల ఆగ్రహం....

Select Suryaa Now
బెల్ట్ షాపుల నిర్వహణపై సర్పంచ్ ల ఆగ్రహం....

మద్దూర్ .దూల్మిట్ట మండలంలో ని అన్ని గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించడానికి నిరసిస్తూ గ్రామాల సర్పంచ్ లో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల స్పెషల్ ఆఫీసర్ శారద అధ్యక్షతనగా మండల సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు మాట్లాడుతూ గ్రామాలలో విచ్చలవిడిగా గల్లి గల్లికి షాపులు నడుస్తున్నాయని ద్వారా గ్రామాలలో సామాన్య ప్రజలు మద్యానికి బానిసై ఎంతోమంది ఆర్థికంగా శారీరకంగా నష్టపోతున్నట్టు సభకు మొరపెట్టుకున్నారు. బెల్ట్ షాపుల్లో తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉండడంతో గ్రామాల్లో ప్రజలు రాత్రింబవళ్లు తేడా లేకుండా మద్యం సేవిస్తున్నారని దీనితో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయని వివిధ గ్రామాల సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అండదండలతోనే గ్రామాలలో యథేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని మండిపడ్డారు. దీంతోపాటు గ్రామాలలో డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాలు పల్లెటూర్లలో లభ్యమవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎంజాయ్ డ్రగ్స్ వలన యువత చెడు మార్గాల్లోకి వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్సెల్ శాఖ ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి బెల్ట్ షాపాను నియంత్రించడంతోపాటు డ్రగ్స్ గంజాయిని అరికట్టాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల నియంత్రణలో ఎక్సైజ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. అంతకుముందు గ్రామాలలో నెలకొన్న వివిధ సమస్యలను సర్పంచ్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాలలో సర్పంచ్ లకు సమాచారం లేకుండా అన్ని పనులు జరుగుతున్నాయని ఫోటో కాల్ పాటించడం లేదని సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీర రాజు, సర్పంచ్ లు గునుకుల లీల జగన్మోహన్ రెడ్డి, నల్లగొప్పుల రేణుక రాములు, బర్మ రాజమల్లయ్య, భాదవత్ లలిత శ్రీనివాస్, మా రెడ్డి నారాయణరెడ్డి, దాసారం బాలకృష్ణ, రమేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.