స్థానిక ఎన్నికల నామినేషన్లపై ఏపీ హైకోర్టులో పిటిషన్: ప్రతివాదులకు నోటీసులు, విచారణ శుక్రవారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ (పిటిషన్) దాఖలైంది. నామినేషన్ల ప్రక్రియలో వివాదాలు, హింసను నివారించేందుకు ఆన్‌లైన్ విధానం ఎంతో దోహదపడుతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.