రుణం తీర్చుకుంటా అవకాశం కల్పించండి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 53వ డివిజన్ శివ జ్యోతి నగర్ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని ఆ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శంకర యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం శివ జ్యోతి నగర్ లోని ముత్తు మరియమ్మ ఆలయం ప్రాంతంలో నాయకులుతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గడపకి వెళ్లి అమ్మ మీ బిడ్డ లాంటి వాడిని, ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా చేపట్టిన ప్రచారంలో స్థానిక మహిళలు ఆయనకి అడుగడుగునా నీరాజనం పలికారు. ఎన్టీ రామారావు నుంచి నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు తిరుపతిని అభివృద్ధి చేశారని, మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు భరోసా కల్పించారు. నవంబర్ ఒకటో తేదీ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్, 53వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ముందుగా డివిజన్లోని ముత్తు మరియమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయుడమ్మ, 53వ డివిజన్ సెక్రెటరీ సుజాతమ్మ, యువరాజ్, ప్రవీణ్, ఐసమ్మ, మహిళలు, యువత పాల్గొన్నారు.