BREAKING
తాత, తండ్రి వారసత్వం పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. 27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ 53 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫిట్‌నెస్ రహస్యం.. ఆ అలవాట్లతోనే నిత్యం యంగ్ లుక్ ఆత్మకూరులో మరో కీలకనేత వైసీపీ కి గుడ్ బై కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఓటేసి ఆశీర్వదించండి. అండగా ఉంటాం జలదంకి లో టిడిపి ఇంటింటి ప్రచారం తెర్లాం లో ఘనంగా గౌరీ నందీశ్వర పూజలు ఇంగ్లండ్‌పై షాదాబ్ ఖాన్ సంచలన అజేయ శతకం.. అంతర్జాతీయ వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టి రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానంలో బహిరంగ వేలం కేటీఆర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ భేటీ ప్రశాంత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్ -- సిఐ బి. యాదగిరి వృద్ధులకు అన్నదానం జడ్పిటిసి అభ్యర్థి శిరీషను అఖండ మెజార్టీతో గెలిపించండి ఎమ్మెల్యే పరిటాల సునీత కడవెరుగులో ఇన్సూరెన్స్‌పై అవగాహన కార్యక్రమం.

మరణంలోనూ మరో ఇద్దరికి చూపునిచ్చిన శేషరత్నం

Select Suryaa Now
మరణంలోనూ మరో ఇద్దరికి చూపునిచ్చిన శేషరత్నం

 

అవనిగడ్డ, మేజర్ న్యూస్: మరణించినా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో పులిగడ్డకు చెందిన కొల్లిపర శేషరత్నం (65) నేత్రదానం చేశారు. అనారోగ్యంతో ఆమె మృతి చెందగా, కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చారు.

భర్త లక్ష్మీనరసింహరావు, కుమారుడు నాగరాజు, కుమార్తెలు హేమలత, నాగమణి సహకారంతో నేత్రదానం జరిగింది. విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చెందిన హరీష్ నేత్రాలను సేకరించారు. గతంలో శేషరత్నం అత్తగారి నేత్రాలను సైతం కుటుంబ సభ్యులు దానం చేయడం విశేషం. నాగాయలంకకు చెందిన సుదర్శి మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది 305వ నేత్రదానమని నిర్వాహకులు రఘు శేఖర్ తెలిపారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.