BREAKING
క్యూబా పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ యువతకు ఎంఎస్ ధోనీ కీలక సందేశం.. ముప్పై ఏళ్లు వచ్చాక బాధపడొద్దంటే ఇప్పుడే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న మిస్టర్ కూల్ *సంగారెడ్డి పట్టణం లోని గురునానక్ మందిర్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగ్గారెడ్డి భూముల పునఃసర్వేపై గ్రామసభ ఎండీ మెడిసిన్‌లో డాక్టర్ ప్రీతి ప్రతిభ.. యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్! *సీసీ రోడ్డు, స్నాన ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే* తాత, తండ్రి వారసత్వం పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. 27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ 53 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫిట్‌నెస్ రహస్యం.. ఆ అలవాట్లతోనే నిత్యం యంగ్ లుక్ ఆత్మకూరులో మరో కీలకనేత వైసీపీ కి గుడ్ బై కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఓటేసి ఆశీర్వదించండి. అండగా ఉంటాం జలదంకి లో టిడిపి ఇంటింటి ప్రచారం తెర్లాం లో ఘనంగా గౌరీ నందీశ్వర పూజలు ఇంగ్లండ్‌పై షాదాబ్ ఖాన్ సంచలన అజేయ శతకం.. అంతర్జాతీయ వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టి

మహర్షి వాల్మీకి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.

Select Suryaa Now
మహర్షి వాల్మీకి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం.  జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.

మెదక్  ; మహర్షి వాల్మీకి జీవితం, ఆదర్శాలు, ఆయన రచించిన రామాయణం సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్  అన్నారు.మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం మానవాళికి ధర్మం, సత్యం, న్యాయం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు. ఆయన జీవితం మనిషిలో మార్పు సాధ్యమేనని, పట్టుదల, జ్ఞానం, నిరంతర కృషితో ఉన్నతమైన లక్ష్యాలను సాధించవచ్చని చాటిచెబుతుందన్నారు. మహర్షి వాల్మీకి బోధనలను ఆచరిస్తూ సమాజంలో సద్భావన, సమానత్వం, నైతిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు.కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహర్షి వాల్మీకి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ వో అంబాదాస్ రాజేశ్వర్, బిసి సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, బిసి సంఘం నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.