లయన్ నటరాజన్ కు మాతృవియోగం-నేత్రదానం చేసిన అంబటి గౌరమ్మ
మహబూబ్ నగర్ సూర్య న్యూస్ -
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అంబటి చంద్రశేఖర్ సతీమణి, రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ , లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ అంబటి నటరాజ్ మాతృ మూర్తి అంబటి గౌరమ్మ (90) నేత్ర దానం చేసి సమాజానికి స్పూర్తి నిచ్చారు. మహబూబ్ నగర్ లోని న్యూటౌన్ కు చెందిన గౌరమ్మ ( లీలావతి) ఈ రోజు ఆకస్మికంగా మృతి చెందారు. మరణాంతరం నేత్రం చేయాలనే గౌరమ్మ సూచన మేరకు నేత్రాలు మరో ఇద్దరికి చూపు ప్రసాదించాలనే ఉద్దేశంతో కళ్ళను దానం చేయడానికి సంకల్పించి ఆమె కుమారుడు లయన్ అంబటి నటరాజ్, మనుమలు అంబటి మణిదీప్, అంబటి పృథ్వీ లు కుటుంబ సభ్యులు లయన్ బాబుల్ రెడ్డి కి సమాచారం అందించారు.ఈ మేరకు డాక్టర్ ఏగూర్ నందన్, ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ శివ సత్వరమే స్పందించి 'కార్నియా' ను సేకరించి, కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రం అందించారు. ఈ సందర్భంగా లయన్ బాబుల్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 280 మంది తమ 'కార్నియా' ను దానంచేసి 560 మందికి చూపు కల్పించామని తెలిపారు.
కాగా బాధలో ఉన్నప్పటికి కార్నియా దానానికి ఒప్పుకొన్న అంబటి గౌరమ్మ కుటుంబ సభ్యులను లయన్స్ క్లబ్ ప్రతినిధులు రమణయ్య గారు, బాబుల్ రెడ్డి , తిరుపతి రెడ్డి, అశ్విని చంద్రశేఖర్ , అశోక్ కుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు.కాగానేత్ర దానం చేయాలనుకునే వారు అంబటి నటరాజ్ 9666900900 ను సంప్రదించాలని కోరారు.
ఓం ప్రకాష్..మహబూబ్ నగర్