BREAKING
బాసర ఐఐఐటిలో నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఇసుక మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం ​ఆర్డీవో ఎలీషా బాబుకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి రాష్ట్ర ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల ప్రోత్సాహం – యువతకు ఉపాధి అవకాశాల కల్పన : రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డా. వై. యువరాజ్ గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కొమురం భీమ్‌ - మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ నా భార్య జ్యోతిక వల్లే ఈ స్థాయిలో ఉన్నాను: దుబాయ్ వేదికగా స్టార్ హీరో సూర్య భావోద్వేగ వ్యాఖ్యలు మరణంలోనూ మరో ఇద్దరికి చూపునిచ్చిన శేషరత్నం మహర్షి వాల్మీకి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. లయన్ నటరాజన్ కు మాతృవియోగం-నేత్రదానం చేసిన అంబటి గౌరమ్మ డీఎస్పీ ఇన్‌బరాజ్ పాత్రలో సూర్య అదరగొట్టే లుక్.. 'సీన్' మూవీ గ్లింప్స్ విడుదల ఏపీ హై కోర్టులో జస్టిస్ అవినాష్ సోమకాంత్ బాటే సంతాప సభ పెండింగ్‌ ఎస్‌ఐఆర్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌. 25వ వార్డులో బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం ఘనంగా మహర్షి వాల్మీఖి జయంతి

అర్ణబ్ తుఫాను నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణకు నెల్లూరు జిల్లా నుంచి 10 ప్రత్యేక బృందాలు

Select Suryaa Now
అర్ణబ్ తుఫాను నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణకు నెల్లూరు జిల్లా నుంచి 10 ప్రత్యేక బృందాలు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    అర్ణబ్ తుఫాను ప్రభావంపై ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో, ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ శివ శంకర్ లోతేటి ఐఏఎస్   ఆదేశాల మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు నెల్లూరు జిల్లా నుంచి 10 ప్రత్యేక విద్యుత్ బృందాలను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి పంపించారు.  ఈ బృందాల్లో మొత్తం 100 మంది విద్యుత్ సిబ్బందితో పాటు నలుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆరుగురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నారు. తుఫాను కారణంగా విద్యుత్ లైన్లు, ఇతర విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లిన పక్షంలో వెంటనే మరమ్మతులు చేపట్టి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఈ బృందాలు సేవలు అందించనున్నాయి. ఈ ప్రత్యేక బృందాలను నెల్లూరు జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్)  పి. సుధాకర్   జెండా ఊపి ప్రారంభించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ పునరుద్ధరణ పనులను సమన్వయంతో, వేగవంతంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెక్నికల్) అల్తాఫ్,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేంద్ర రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు  చిన్నస్వామి నాయక్,  పి. చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.