"సర్వేపల్లి లో వై కా పా లోకి వరస చేరికలతో చతికిలపడ్డ టి డి పి "
సర్వేపల్లి, మేజర్ న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి నివాసం లో వెంకటాచలం మండలం, ఎగువమిట్ట గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరిక పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన కాకాణి పార్టీలో చేరిన దుత్తపాటి మహేష్, పాకం వెంకటరమణయ్య, దుత్తపాటి శివ, వేనాటి జయ, అప్ప గుంట సుమన్, దుత్త పాటి చరణ్, నెల్లూరు శ్రీకాంత్, నెల్లూరు కరుణాకర్, నెల్లూరు హర్షవర్ధన్, నెల్లూరు రమేష్, కూనమల్లి వెంకటేశ్వర్లు,తాండ్ర శ్రీనివాసులు, కూనమల్లి రమేష్ బాబు, తదితరులు
సోమిరెడ్డి అవినీతి దురాగతాలను భరించలేక ప్రజలు టీడీపీ కి ని వీడి వైఎస్సార్ సీపీలో చేరడం అత్యంత శుభపరిణామం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల నమ్మకంతోనే వేలాది మంది నేడు పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడడంతోపాటు ఏకపక్ష వైఖరి, కక్షసాధింపు చర్యల వల్ల, దూరమవుతున్న టీడీపీ క్యాడర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి సర్వం దోచుకుంటూ, అడ్డగోలుగా దోపిడీకి పాల్పడడాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీని వీడుతున్న ప్రధాన నేతలు. తెలుగు దేశం నాయకులను, కార్యకర్తలను, సానుభూతిపరులను, టీడీపీలోకి చేర్పించుకుంటూ చేరికలు అంటూ ప్రచారం చేసుకునే హీనమైన స్థితికి చేరిన సోమిరెడ్డి నియోజకవర్గంలో అసలైన, పాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమిరెడ్డి అరాచకాలను తట్టుకోలేక రోజురోజుకూ పార్టీకి దూరమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమం ,నిజాయితీ కలిగిన రాజకీయాల పట్ల ఆకర్షితులై నేడు యువత పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఐదేళ్ల పాలనలో ప్రతీ ఇంటికీ నేరుగా సంక్షేమ పథకాలను అందించిన వైఎస్ జగనన్న చేసిన మేలును ప్రజలు ఎన్నటికీ మరచిపోరు. క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను గమనించి, వారి అండగా నిలబడే ఏకైక శక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ప్రజలు తెలుసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు , కార్యకర్తలపై టీడీపీ వేధింపులు ఎక్కువైతే మరింత రెట్టింపు ఉత్సాహంతో పోరాడతాం తప్ప ఎవరికీ భయపడబోం. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు , ఈరోజు బెదిరింపు రాజకీయాలు చేస్తున్న వారికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారు కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి,పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకూ, వైఎస్సార్ సీపీ నాయకత్వం ఎల్లప్పుడూ కొండంత అండగా నిలబడుతుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో టీడీపీ నుంచి మరిన్ని కుటుంబాలు వైఎస్సార్ సీపీ వైపు రావడం ఖాయం. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తకు, సమచిత స్థానం కల్పిస్తాం, అందరం కష్టపడి పనిచేసి, స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం