BREAKING
నాడు నేరాలు – నేడు ప్రవచనాలు చెబుతున్న వైసీపీ - ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గిరిజన డిగ్రీ కళాశాలలో ఘనంగా కొమురం భీం వర్ధంతి బాధితులకు సత్వర న్యాయం అందిస్తాం. పోలీస్ ప్రజావాణిలో సి సి ఎస్ సి ఐ శంకర్ *ఎంపీడీవో విధుల్లో శిక్షణ కలెక్టర్ సూయస్ కుమార్ IAS* మచ్చ --హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం : డా. కె.వి. కృష్ణారావు రీ సర్వేలో మూడు గ్రామాల సరిహద్దుల నిర్ధారణ అర్ణబ్ తుఫాను నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణకు నెల్లూరు జిల్లా నుంచి 10 ప్రత్యేక బృందాలు విద్యుత్ సర్వీసులను వినియోగానికి అనుగుణమైన సరైన కేటగిరీలోనే వినియోగించుకోవాలి సత్వరమే ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా రొంపిచెర్ల జెడ్పీటీసీ పోరు రసవత్తరం… కొమురం భీం  ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి... ఆదివాసీ సంఘాల నాయకులు క్రిస్ బ్రౌన్‌కు ఊరట...యూకే కోర్టులో తప్పిన జైలు శిక్ష, వివాదాస్పద కేసులో తీర్పు లా లీగా క్లాసికో పోరులో రియల్ మాడ్రిడ్ సంచలన విజయం పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యం: ఎంఈఓ బండి గోవిందయ్య. ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు...అధ్యక్ష బరిలోకి లె పెన్

కొమురం భీమ్ ఆశయాలను సాధించాలి

Select Suryaa Now
కొమురం భీమ్ ఆశయాలను సాధించాలి

సూర్య మంచిర్యాల టౌన్ : ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఆదివాసీ వీరుడు కొమురం భీమ్ 86వ వర్ధంతి సందర్భంగా సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి కోసం జల్‌–జంగల్‌–జమీన్‌  నినాదంతో పోరాడిన కొమురం భీమ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.అణిచివేతకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.కొమురం భీమ్ ఆశయాలను వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా ఆదివాసీలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు.గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అన్నారు.ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, భాషలను పరిరక్షించడంతో పాటు రాజ్యాంగం కల్పించిన హక్కులను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఆదివాసీ యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కొమురం భీమ్ ఆశయాల సాధనే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పూరెల్ల నితీష్, జిల్లా కోయ సంఘం గౌరవ అధ్యక్షుడు నైతం లక్ష్మణ్, నస్పూర్ మండల అధ్యక్షుడు ఆత్రం సమ్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.