BREAKING
రాజవంశానికి చెందిన రాణి విజయమ్మ కన్నుమూశారు పొంగూరులో వాల్మీకి జయంతి వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలపై వ్యాసరచన పోటీ నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు -మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి – అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం గడిపెద్దాపూర్‌ లో భారీ అగ్నిప్రమాదం అభివృద్ధి ఏకైక అజెండాగా రాజకీయ రంగ ప్రవేశం - బొమ్మిరెడ్డి షకీలా - బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి రామాయణం సినిమాలోని మంగళ్ రంగ్ సాంగ్‌పై నెట్టింట దుమారం.. ఏఆర్ రెహమాన్ సూఫీ సంగీతంపై వ్యతిరేకత ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం *అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం* *ఏలూరు సర్కిల్, జంగారెడ్డిగూడెం డివిజన్లలో 24 గంటల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి వేడుకలు బాసర ఐఐఐటిలో నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఇసుక మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం ​ఆర్డీవో ఎలీషా బాబుకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి

నాడు నేరాలు – నేడు ప్రవచనాలు చెబుతున్న వైసీపీ - ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

Select Suryaa Now
నాడు నేరాలు – నేడు ప్రవచనాలు చెబుతున్న వైసీపీ - ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

అమరావతి, మేజర్‌ న్యూస్‌ :

ఫగత పది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తూ, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వారి వైఖరి చూస్తుంటే “ఆడలేక మధ్యలో ఓడినట్లు” అనే సామెత గుర్తుకు వస్తోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ ఎద్దేవా చేశారు. సోమవారం టీడీపీ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ తమ పత్రిక, ఛానల్, సోషల్ మీడియా, పెయిడ్ ప్రచారాల ద్వారా రాష్ట్రంలో ఏదో గందరగోళం జరుగుతున్నట్లు చిత్రీకరిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అబద్ధపు ప్రచారాన్ని చూస్తే గోబెల్స్ కూడా ఆశ్చర్యపోయేవాడు. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని అస్థిరపరచాలనే దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నారు.  సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్నికల సంఘం కొన్ని ప్రాంతాల్లో, మైదుకూరు మున్సిపాలిటీలో మళ్లీ నామినేషన్లు వేయడానికి అవకాశం కల్పించింది. కడప, తిరుపతి, రాజంపేటలో నామినేషన్లు వేసిన వైసీపీ మైదుకూరులో ఒక్క స్థానానికి కూడా నామినేషన్ ఎందుకు వేయలేదో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పుంగనూరు, పులివెందులలో జడ్పీటీసీలకు నామినేషన్లు వేసి, ఎంపీటీసీలకు వేయకుండా వదిలేశారు. ఇది కేవలం కోర్టుల్లో, ఎన్నికల సంఘంపై ఇబ్బంది కలిగించడానికే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయాలనే ఆలోచన వారికి లేదు.  రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక చర్యలకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలే కారణం. రెండు నెలల క్రితం ఆయనే “ఏకగ్రీవం అయితే ఇన్‌చార్జ్‌కు టికెట్ ఇవ్వము” అని చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టారు. ప్రశాంతంగా ఉన్న రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో మళ్లీ ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకొస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం.  మేనకోడలి పెళ్లికి భద్రత లేదని జగన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు. గతంలో తాడేపల్లిలో సంక్రాంతి, దసరా, క్రిస్మస్ సంబరాలు వందలాది మందితో జరుపుకున్నప్పుడు భద్రత గుర్తుకు రాలేదా? శుభకార్యాల్లో కూడా అడ్డుపడే ఆయన మానసిక స్థితి ఆలోచించదగినది.  గతంలో తుపాకులు, బాంబులు చేతబట్టి ఊళ్లపై దాడులు చేసినవారు, పోలింగ్ బూత్‌లపై దాడులు చేసినవారు ఈరోజు శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. 2021 బాధితులకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాబు సూచన మేరకు అణచుకొని శాంతియుతంగా ఉన్నారు. జడ్పీటీసీలకు వైసీపీ 1817 నామినేషన్లు వేయగా, తెలుగుదేశం పార్టీ 2078 వేసింది. ఎంపీటీసీలకు వైసీపీ 20,556, తెలుగుదేశం పార్టీ 22,013 నామినేషన్లు వేశారు. మొత్తం జడ్పీటీసీలకు 5,724, ఎంపీటీసీలకు 51,902 నామినేషన్లు వచ్చాయి. ఇంతమంది నామినేషన్లు వేసిన తర్వాత కూడా “అడ్డుకుంటున్నారు” అని చెప్పడం వితండవాదనే.  ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఎన్నికలు జరగాలి. తెలుగుదేశం పార్టీ, ఎన్‌డీఏ కూటమి ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి ఎన్‌డీఏ అభ్యర్థులందరినీ గెలిపించాలని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.