BREAKING
క్రిస్ బ్రౌన్‌కు ఊరట...యూకే కోర్టులో తప్పిన జైలు శిక్ష, వివాదాస్పద కేసులో తీర్పు లా లీగా క్లాసికో పోరులో రియల్ మాడ్రిడ్ సంచలన విజయం పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యం: ఎంఈఓ బండి గోవిందయ్య. ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు...అధ్యక్ష బరిలోకి లె పెన్ తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కొత్త సినిమా

ఆధ్యాత్మిక శోభతో సత్యనారాయణ స్వామి ఆలయం

Select Suryaa Now
ఆధ్యాత్మిక శోభతో సత్యనారాయణ స్వామి ఆలయం

విశాఖపట్నం, సూర్య : పూర్వ మార్కెట్ ఇసుకకొండపై వేంచేసియున్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సోమవారం వైభవంగా జరిగాయి. శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకులు పి. నరసింహాచార్యులు స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు.

ఉదయం 4 గంటల నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. మూడు బ్యాచ్‌లలో మొత్తం 126 మంది దంపతులు సత్యనారాయణ స్వామివారి వ్రతాలను ఆచరించారు. వ్రతాలు నిర్వహించిన దంపతులకు శేషవస్త్రం, స్వామివారి ఫొటో, నూక ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు. మధ్యాహ్నం సుమారు వెయ్యి మంది భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. సాయంత్రం భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొరుకొండ సూర్యప్రసాద్‌తో పాటు బొట్టా సరోజిని, జెర్రిపోతుల ప్రసన్న, నెల్లబల్లి వెంకటలక్ష్మి, ఉప్పులి అప్పులకొండ యాదవ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాల వివరాలను ఆలయ ఈవో టి. రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.