BREAKING
క్రిస్ బ్రౌన్‌కు ఊరట...యూకే కోర్టులో తప్పిన జైలు శిక్ష, వివాదాస్పద కేసులో తీర్పు లా లీగా క్లాసికో పోరులో రియల్ మాడ్రిడ్ సంచలన విజయం పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యం: ఎంఈఓ బండి గోవిందయ్య. ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు...అధ్యక్ష బరిలోకి లె పెన్ తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కొత్త సినిమా

అర్నబ్' ముప్పుపై యంత్రాంగం అప్రమత్తం

Select Suryaa Now
అర్నబ్' ముప్పుపై యంత్రాంగం అప్రమత్తం

గాజువాక, సూర్య : 'అర్నబ్' తుఫాను ముప్పు నేపథ్యంలో విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని వీఎంఆర్‌డీఏ ఎస్టేట్ అధికారి దయానిధి, జీవీఎంసీ జోనల్ కమిషనర్ శేషాద్రి, గాజువాక తహసీల్దార్ త్రినాథ్ ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, వైద్య, విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులతో వారు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విపత్తు వేళ ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ తక్షణ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​తుఫాను నేపథ్యంలో వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. గాలివాన సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని, కూలే ప్రమాదం ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలకు, తెగిపడిన కరెంటు తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల వాసులు అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్ఐ  మృదుల గాజువాక, దువ్వాడ ఎస్‌ఐలు రామకృష్ణ, వెంకట్ లక్ష్మితో పాటు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.