BREAKING
రొంపిచెర్ల జెడ్పీటీసీ పోరు రసవత్తరం… కొమురం భీం  ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి... ఆదివాసీ సంఘాల నాయకులు క్రిస్ బ్రౌన్‌కు ఊరట...యూకే కోర్టులో తప్పిన జైలు శిక్ష, వివాదాస్పద కేసులో తీర్పు లా లీగా క్లాసికో పోరులో రియల్ మాడ్రిడ్ సంచలన విజయం పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యం: ఎంఈఓ బండి గోవిందయ్య. ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు...అధ్యక్ష బరిలోకి లె పెన్ తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు

కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి*  *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, అక్టోబర్ 26: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి పత్తికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఆలూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఆదోని మండలం విరుపాపురం గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో , ఎమ్మిగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర & బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి ఏర్పాటు చేసిన గదులను, స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ హాళ్లలో టేబుళ్ల ఏర్పాటు, సిబ్బంది రాకపోకలకు అనువైన మార్గాలు, రిసెప్షన్ కేంద్రాల నిర్వహణ, వాహనాల పార్కింగ్ నిర్వహణకు సంబంధించిన అంశాలను కలెక్టర్ పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.. కౌంటింగ్ రూమ్ లోకి ఎంట్రన్స్ వద్ద బ్యారికేడింగ్ సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ రూమ్ లో ఎక్కువ లైటింగ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లు, రిసెప్షన్ కేంద్రాలు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, కౌంటింగ్ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. కౌంటింగ్ రూమ్ లలో విద్యుత్ సరఫరా, లైటింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర అవసరమైన సౌకర్యాలను పరిశీలించి, లోపాలుంటే వెంటనే సరిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు...

కౌంటింగ్ కేంద్రాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లు, భవనాల ముందు, వెనుక భాగాలు, ప్రవేశ ద్వారాలు, పరిసర ప్రాంతాల్లో అవసరమైన సంఖ్యలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోని ప్రతి కీలక ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించే విధంగా కెమెరాల ఏర్పాటు ఉండాలని, సీసీటీవీ ఫుటేజీని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు.. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, సీసీటీవీ కెమెరాల ద్వారా లభించే ఫుటేజీని నిరంతరం పర్యవేక్షించేందుకు అవసరమైన మానిటర్లు, సాంకేతిక పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.  కౌంటింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కౌంటింగ్ విధుల కోసం వచ్చే సిబ్బందికి వాహనాల పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు చేరుకునే మార్గాలు, ప్రవేశ ద్వారాలు, రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లకు వెళ్లే దారులకు సంబంధించి స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.  రిసెప్షన్ కేంద్రాల్లో విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలని, స్టాట్యూటరీ, నాన్-స్టాట్యూటరీ కౌంటర్లను అవసరానికి అనుగుణంగా ఏర్పాటు చేయాలన్నారు..

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని కేంద్రాల్లో పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు..  కౌంటింగ్ కేంద్రాల వెనుక భాగాలు ఉండే ప్రాంతాల్లో  వెలుతురు ఉండేలా ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయాలని ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసే అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఒకేసారి వీక్షించే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, కీలక ప్రాంతాల్లో జరుగుతున్న కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ తెలిపారు.

కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, ఆదోని అదనపు ఎస్పీ జయ శర్మ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.