BREAKING
జడ్పిటిసి ఎంపిక ఉత్కంఠ కు తెర. ఆర్నబ్ తుఫాన్‌.. వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి.. మండలంలో ఐదుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవం దేశవాళీ క్రికెట్‌పై భువనేశ్వర్ కుమార్ కీలక ప్రకటన.. ఆ టోర్నీలపైనే పూర్తి ఫోకస్ సరుబుజ్జిలి జడ్పిటిసి అభ్యర్థిగా సింగుపురపు దివ్య రోడ్డు ప్రమాదంలో ఏ ఎస్ ఓ మృతి ఏడుపాయల మంజీరా నదిలో తల్లి, ఇద్దరు కుమార్తెల కోసం గాలింపు: గెలిచిన నెలలో సమస్యలు పరిష్కరిస్తాను -చింతల చేను ప్రచారంలో రాజారెడ్డి హామీ రైలు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి ఆర్నాబ్' తుఫాన్ బీభత్సం పూతలపట్టులో 13 ఎంపీటీసీ స్థానాలలో 8 ఏకగ్రీవం, 5 స్థానాలకు పోలింగ్ ఓటరు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ కార్యాచరణ -"ఓట్ బచావో–దేశ్ బచావో "పై కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సమీక్ష కూటమిలో ఎవరికి వారే! రంజీ ట్రోఫీలో సరాన్ష్ జైన్ రికార్డు బౌలింగ్.. బిహార్‌పై మధ్యప్రదేశ్ ఘన విజయం

స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ఆర్.వసంతకుమారి ప్రచారానికి విశేష ఆదరణ...!

Select Suryaa Now
స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ఆర్.వసంతకుమారి ప్రచారానికి విశేష ఆదరణ...!

స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ఆర్.వసంతకుమారి ప్రచారానికి విశేష ఆదరణ...!
- ప్రచారంలో దూసుకుపోతున్న వసంత కుమారి
- గ్యాస్ సిలిండర్ గుర్తు కు ఓటు వేసి గెలిపించండి
-  తోగట వీర క్షత్రియ ఆడబిడ్డకు ఆలయ కమిటీ కొండంత అండ

నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించండి ..మీ ఆశీస్సులతో ప్రజాసేవ చేసే అవకాశం కల్పించండి అంటూ మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థి వసంత కుమారి ప్రచారంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. సోమవారం పట్టణంలో స్వతంత్ర అభ్యర్థి వసంత కుమారి నిర్వహించిన ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తుంది. అవ్వ ..తాత బాగున్నారా అంటూ అక్కా.. చెల్లెలు.. తమ్ముడు.. మీ ఓటు గ్యాస్ సిలిండర్ కే మీ ఓటు నాకే అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు.గ్యాస్ సిలిండర్ గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న వసంత కుమారి తోగట వీర క్షత్రియ కులానికి చెందిన వారు కావడం విశేషం. అందులో భాగంగానే స్థానికంగా బలమైన పట్టు ఉన్న తోగట వీర క్షత్రియ సంఘం, ఆలయ కమిటీ ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించింది. దీంతో ఆమె ప్రచారంలో  ఉత్సాహం రెట్టింపు కనిపిస్తోంది. మహిళలే బలంగా మిగతా అభ్యర్థులకు భిన్నంగా ఆర్. వసంత కుమారి ప్రచారం సాగుతోంది. ఆమె వెంట పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం విశేషం. పెద్ద హంగు, ఆర్భాటాలు లేకుండా వీధి వీధిన తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి, ఆప్యాయంగా పలకరిస్తూ ఓటును అభ్యర్థిస్తున్న తీరు పట్టణంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "పార్టీలకతీతంగా అభివృద్ధే లక్ష్యం, మహిళా సాధికారతే ధ్యేయం" అంటూ ఆమె చేస్తున్న ప్రచారానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. (ఎమ్మెస్సీ బీఈడీ )విద్యార్హత కలిగిన ఆమె విద్యావంతురాలు కావడం కూడా పట్టణ ప్రజల్లో సానుకూలత మొదలైంది. ఫలితంపై ఉత్కంఠ ఒకే సామాజిక వర్గంలో నలుగురు పోటీలో ఉండటం, ఒకవైపు బలమైన కుల సంఘం మద్దతుతో, మహిళా ఓటర్లను ఆకట్టుకుంటూ స్వతంత్ర అభ్యర్థి దూసుకుపోవడం నందికొట్కూరు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.