కల్లూరు అర్బన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం.. 37, 38, 39వ వార్డుల్లో కాటసాని విస్తృత ప్రచారం.
*కర్నూలు కె.ఏం. సి మేజర్ న్యూస్: కల్లూరు అర్బన్ పరిధిలోని 37, 38, 39వ వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు ఆయా వార్డుల్లో పర్యటిస్తూ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు..*
*ఈ సందర్భంగా 37వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి హేమలత గారు, 38వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఎద్దుల ప్రవళిక గారు, 39వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి చిట్టిబాబు గారు, కర్నూలు నగర మేయర్ అభ్యర్థి సుశీలమ్మ గారిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు..*
*ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలను నేరుగా కలుసుకున్న కాటసాని రామభూపాల్ రెడ్డి గారు వార్డుల్లోని సమస్యలు, అభివృద్ధి అంశాలపై ప్రజలతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు..*
ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి సంగాల సుదర్శన్ రెడ్డి గారు, కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి గారు, ఆయా వార్డులకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు..