BREAKING
48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిల సూర్య కళ జోరు వానలో ఎన్నికల ప్రచారం మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం వలస ఓటర్లకు అభ్యర్థులు ఫోన్ కాల్స్ గంభీరం రిజర్వాయర్‌ వద్ద అప్రమత్తంగా ఉండాలి కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం.. డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాను -60వ డివిజన్ ప్రచారంలో సుధాకర్ రెడ్డి హామీ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు.. ఆనందపురం జడ్పీటీసీ స్థానం జనసేనకు..!! కరగాం ఎంపీటీసీ అభ్యర్థిగా పంగ జైచంద్రకుమార్.. ఓవర్సీస్‌లో రణబాలి సునామీ.. బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ రికార్డు వసూళ్లు అర్ణబ్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ​'అర్నబ్' అలెర్ట్.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు ఇండిపెండెంట్ అభ్యర్థిగా సత్యనారాయణ ఏకగ్రీవం మీ బిడ్డలుగా ఆశీర్వదించండి... -57వ డివిజన్ లో గాలి కావ్య, ఎం రాజేష్ ప్రచారం నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆత్మకూరులో ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - విజయ పదంలో స్థానికం

Select Suryaa Now
ఆత్మకూరులో ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - విజయ పదంలో స్థానికం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ చక్రం తిప్పారు. ఆయన పన్నిన వ్యూహం అనూహ్యంగా ఫలించింది. బొమ్మిరెడ్డి కుటుంబీకులు తెలుగుదేశం లోకి రప్పించారు. దాంతోపాటు పలువురు ప్రముఖులను కూడా తెలుగుదేశంలోకి రప్పించగలిగారు. దాంతో కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆత్మకూరు మున్సిపాలిటీలో విజయ డంకా మ్రోగించే పరిస్థితి ఏర్పడింది. రామ నారాయణ రెడ్డి త్రిప్పిన చక్రం అందర్నీ ఆశ్చర్య చకితులను గావించడంతోపాటు ప్రతిపక్షాలకు ఇబ్బందికరంగా మారింది. రామనారాయణ రెడ్డి అనూహ్యంగా బొమ్మిరెడ్డి వంశంలోని యువనేత బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి, ఆయన తల్లి డాక్టర్ షకీలా, ఆయన సతీమణి డాక్టర్ గీతికాలతో కలిసి రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు తెలుగుదేశంలో ప్రవేశించడంతోపాటు ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం తరఫున రంగంలో దిగారు. రామనారాయణ రెడ్డి అంతటితో ఆగకుండా కొంతకాలంగా దూరంగా ఉంటున్న సీనియర్ తెలుగుదేశం నాయకుడు చల్లా రవికుమార్ రెడ్డిని దగ్గరకు రప్పించారు. గత తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత,అభిరాం హాస్పిటల్ అధినేత డాక్టర్ కె వి శ్రావణ్ కుమార్ రెడ్డి -డాక్టర్ మేకపాటి దీప్తి దంపతులను పార్టీ లేక ఆహ్వానించి తెలుగుదేశం తీర్థం స్వీకరింపజేశారు. దాంతోపాటు వెంకటేశ్వర హాస్పిటల్ ఎండిగా ఉన్న డాక్టర్ జాగర్లమూడి ప్రదీప్- డాక్టర్ హారిక దంపతులను, హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వరరావును తెలుగుదేశం లోకి ఆనం రప్పించారు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఇందూరు నరసింహారెడ్డిని పార్టీకి దగ్గరకు చేర్చారు. కేకేఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ డాక్టర్ జి సుధాకర్ రెడ్డి సతీమణి డాక్టర్ అరుణమ్మ కూడా మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి డాక్టర్ షకీలాకు సన్నిహితురాలు అయినందున ఆమె కూడా ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె తెలుగుదేశం నాయకురాలు ఆనం కైవల్యా రెడ్డి ముమ్మరంగా డాక్టర్ షకీలా విజయం కోసం మున్సిపాలిటీలోని అన్ని వార్డులు అభ్యర్థుల విజయం కోసం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం ఇంటింటా నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఒక్కసారిగా అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేలా ఆనం చక్రం తిప్పారు. దాంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. విజయ పదం వైపు వారంతా విజయోత్సాహంతో ప్రచారం లో దూసుకెళుతున్నారు. అభివృద్ధిలో అందె వేసిన చేయిగా పేరుగాంచిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనదైన అనుభవ శైలిలో రాజకీయం నడుపుతుండ డంతో ప్రతిపక్షాల వెన్ను విరిగినట్లుగా సర్వత్రా భావిస్తున్నారు.ఏదేమైనా పార్టీలో ప్రవేశించిన ప్రముఖులందరూ తెలుగుదేశం బిజెపి జనసేన అభ్యర్థుల విజయం కోసం కృషి చేయబూనడంతో అభ్యర్థుల ఆనందాలకు అవధులు లేకుండా ఉన్నాయి.