మీ బిడ్డలుగా ఆశీర్వదించండి... -57వ డివిజన్ లో గాలి కావ్య, ఎం రాజేష్ ప్రచారం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మీ బిడ్డలుగా మమ్మలను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని 57వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గాలి కావ్య, ఎం రాజేష్ ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా మంగళవారం మారుతీ నగర్ పరిసర ప్రాంతాలలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రచారంలో గాలి కావ్య, ఎం రాజేష్ కు కర్పూర హారతులతో బ్రహ్మరథం పట్టారు. మీరు మా పిల్లలు మీకు ఓటు వేసి గెలిపించుకునే బాధ్యత మాదని ఘనంగా సత్కరించి అభిమానించారు. దగ్గరలోనే తన కార్యాలయం ఉందని ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు మందుబాబుల వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని వారు దృష్టికి తీసుకువచ్చారు. డివిజన్ పరిధిలో మహిళలతో ఆడపిల్లలతో ఆకతాయిగా ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాగే మహిళల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. డ్రైనేజీ త్రాగునీరు దోమల బెడద సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్కార్యక్రమంలో ఎం గుణ, కళా, కవిత, కల్పన, ఉమా, వరదరాజులు, వెంకటరమణ రాజు, రామ్మూర్తి, రెడ్డప్ప, వేణు, రుద్ర, నవీన్, కిరణ్, హేమంత్, శంకర్, ముని మోహన్, గణేష్ మార్కెట్, శశి, డిల్లీ, రాజేష్, మున్నా, వర్షిత్, సంతోష్, తరుంటేజ, హరీష్ , షారుక్, హేమంత్ (అక్కి, మహీ), సాయి స్థానిక మహిళలు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్