BREAKING
శ్రీలంక టెస్ట్ జట్టుకు భారీ షాక్.. పాకిస్తాన్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక దూరం ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ 'కల్షి' కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారానికి , పోలేపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను.!!!.తిమ్మా నాయుడు దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం

అర్ణబ్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Select Suryaa Now
అర్ణబ్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

 

- అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలి

- మత్స్యకారులు, వంశధార, నాగావళి, బహుధా, మహేంద్ర తనయ నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 
శ్రీకాకుళం 
అక్టోబర్ 27 మేజర్ న్యూస్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అర్ణబ్ తుఫాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రజల భద్రత, ముందస్తు నివారణ చర్యలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు. ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌, ఇతర జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో తుఫాను తాజా పరిస్థితులు, భారీ వర్షాలు కురిసే అవకాశాలు, జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యల గురించి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. తుఫాను కారణంగా ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అక్టోబర్ 28న తీరాన్ని దాటే అవకాశం

తుఫానుకు సంబంధించి భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించిన అంచనాలను ప్రజలు గమనించాలని మంత్రి సూచించారు. తుఫాను తీరాన్ని దాటే సమయం, గాలుల వేగం, వర్షాల తీవ్రతకు సంబంధించి అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలి

తీరప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. కంట్రోల్ రూములు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని, పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, ఇతర అవసరమైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, అత్యవసర సహాయక పరికరాలను సిద్ధంగా ఉంచాలని, విద్యుత్, వైద్య, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం అందించాలని కోరారు.

నాలుగు నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వంశధార, నాగావళి, బహుధా, మహేంద్ర తనయ నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాల కారణంగా నదుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీరాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

నదుల్లో నీటి ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలని సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు నదులు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకూడదని, వరద నీటిలోకి వెళ్లకూడదని, అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

మత్స్యకారులు, రైతుల భద్రతకు ప్రాధాన్యత

తుఫాను ప్రభావం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు చేపల వేటకు దూరంగా ఉండాలని, ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారుల భద్రతకు అవసరమైన సూచనలు అందించాలని సంబంధిత అధికారులకు తెలిపారు.

వరి, మొక్కజొన్న, పత్తి, అపరాల పంటలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. అరటి, బొప్పాయి, కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటలకు నష్టం తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పశుగ్రాసం, పశువైద్య సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి

బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని మంత్రి సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల సమీపంలో ఉండకూడదని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.


ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని, ప్రజలు కూడా అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ తుఫానును ఎదుర్కొనేందుకు సహకరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు.