ఇండిపెండెంట్ అభ్యర్థిగా సత్యనారాయణ ఏకగ్రీవం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం అనపర్తి మండలం రామవరం-2 ఎంపీటీసీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆదాడి చినసత్యనారాయణ (సత్తిబాబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి నుంచి డిక్లరేషన్ పొందిన అనంతరం అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు.గ్రామంలో పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో రామవరం-2 ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు సత్తిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.