BREAKING
శ్రీలంక టెస్ట్ జట్టుకు భారీ షాక్.. పాకిస్తాన్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక దూరం ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ 'కల్షి' కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారానికి , పోలేపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను.!!!.తిమ్మా నాయుడు దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం

​'అర్నబ్' అలెర్ట్.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు

Select Suryaa Now
​'అర్నబ్' అలెర్ట్.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు
  •  సీఐ వాసునాయుడు

గాజువాక, సూర్య:  'అర్నబ్' తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గాజువాక సీఐ వాసునాయుడు సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. గాలివానకు కరెంటు తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, చెట్లు, పాత గోడలు, భారీ హోర్డింగుల కింద వాహనాలు నిలపకూడదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల వారు అధికారుల సూచనలతో తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. విపత్తు సమయాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ప్రజలంతా ముందస్తుగా కనీస నిత్యావసరాలను సమకూర్చుకోవాలని సీఐ సూచించారు. వర్షపు నీటితో నిండిన రహదారులు, కల్వర్టులను దాటే సాహసం చేయొద్దని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. తుఫాను తీవ్రతపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని.. వరదల్లో చిక్కుకున్నా, చెట్లు కూలినా, విద్యుత్ అంతరాయం ఏర్పడినా తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ '112'కు డయల్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు వేళ ప్రాణనష్టం జరగకుండా చూడటమే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యమని, విపత్తు నిర్వహణలో ప్రతి ఒక్కరూ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.