BREAKING
దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్ జర్మనీ పారిశ్రామిక రంగంలో టీకే ఎలివేటర్ రికార్డు స్థాయి వార్షిక లాభాలు

కరగాం ఎంపీటీసీ అభ్యర్థిగా పంగ జైచంద్రకుమార్..

Select Suryaa Now
కరగాం ఎంపీటీసీ అభ్యర్థిగా పంగ జైచంద్రకుమార్..


-  దంత వైద్యుడికి బీ-ఫారం మంజూరు చేసిన జనసేన .

నరసన్నపేట అక్టోబర్ 27 మేజర్ న్యూస్: నరసన్నపేట మండలం కరగాం ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రముఖ దంత వైద్యుడు పంగ జైచంద్రకుమార్‌కు జనసేన పార్టీ అధిష్ఠానం బీ-ఫారం మంజూరు చేసింది. ఉన్నత విద్యావంతుడైన యువ వైద్యుడికి పార్టీ అవకాశం కల్పించడంపై స్థానికంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పంగ జైచంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ, రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తనకు పార్టీ అవకాశం కల్పించిందన్నారు. అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేసే పథకాలు అర్హులైన ప్రజలకు సక్రమంగా అందేలా తనవంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, వాటి పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని వెల్లడించారు.

జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజలు మద్దతు తెలిపి, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు శిమ్మ లక్ష్మణరావు, వెలమల కామేష్, పీస మోహనరావు, సాధు ఆనందరావు తదితరులు పంగ జైచంద్రకుమార్‌కు మద్దతు తెలిపారు.