BREAKING
ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ 'కల్షి' కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారానికి , పోలేపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను.!!!.తిమ్మా నాయుడు దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు

జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు..

Select Suryaa Now
జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు నేడు  సెలవు..

శ్రీకాకుళం, అక్టోబర్ 27 మేజర్ న్యూస్:;బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా శ్రీకాకుళం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు అంగన్వాడి కేంద్రాలతో సహా. బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, తుఫాను ప్రభావం వల్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సహా అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ సెలవు వల్ల విద్యార్థుల విద్యాక్యాలెండర్‌కు ఆటంకం కలగకుండా, నష్టపోయే పనిదినాన్ని భర్తీ చేయడానికి తగిన ప్రత్యామ్నాయ పనిదినాన్ని కేటాయిస్తూ త్వరలోనే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని కలెక్టర్ వివరించారు. అధికారులు, పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండి విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.