BREAKING
శ్రీలంక టెస్ట్ జట్టుకు భారీ షాక్.. పాకిస్తాన్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక దూరం ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ 'కల్షి' కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారానికి , పోలేపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను.!!!.తిమ్మా నాయుడు దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం

ఆనందపురం జడ్పీటీసీ స్థానం జనసేనకు..!!

Select Suryaa Now
ఆనందపురం జడ్పీటీసీ స్థానం జనసేనకు..!!

ఆనందపురం, సూర్య: ఆనందపురం మండల జడ్పీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్ని శ్రీనివాసరావు ఖరారయ్యారు. కూటమి పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎన్ని శ్రీనివాసరావుకు బీ-ఫారం అందజేశారు. జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పంచకర్ల సందీప్‌  ఆయనకు బీ-ఫారం అందించారు. దీంతో ఆనందపురం మండల జడ్పీటీసీ ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం ఖరారైంది.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్ని శ్రీనివాసరావు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పలు కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు. రాజకీయ అనుభవం కలిగిన కుటుంబ నేపథ్యంతో పాటు, ప్రజాసేవా కార్యక్రమాల ద్వారా స్థానికంగా గుర్తింపు పొందారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన ఆయన, అనంతరం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని ఎన్ని శ్రీనివాసరావు, ఈసారి జడ్పీటీసీ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. తనకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించి, బీ-ఫారం అందజేసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పంచకర్ల సందీప్‌లకు ఎన్ని శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.