డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాను -60వ డివిజన్ ప్రచారంలో సుధాకర్ రెడ్డి హామీ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : సుభాష్ నగర్ నుంచి అక్కారం పల్లి వరకు తేలికపాటి వర్షానికి రోడ్లు వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గతంలో పనిచేసిన అనుభవం, స్థానికులుగా తనకి ఉన్న పరిచయాలతో డివిజన్ పరిధిలో త్రాగునీరు, డ్రైనేజీ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని 60వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆయన విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం అకారంపల్లి, సుభాష్ నగర్, సాయంత్రం సుబ్బారెడ్డి దగ్గర ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరిగి జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఉరుసు నెంబర్ 3 స్టవ్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. గతంలో పనిచేసిన అనుభవం ఉండడంతో డివిజన్లో ప్రతి సమస్యను గుర్తించి అధికారులు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడే పుట్టిన పెరిగిన వ్యక్తిగా తనకు అన్ని అనుభవాలు ఉన్నాయని, వాటిని డివిజన్ అభివృద్ధికి వినియోగించి సమస్య లేని డివిజన్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, అనిల్ కుమార్, పూర్ణచంద్ర, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్