BREAKING
దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్ జర్మనీ పారిశ్రామిక రంగంలో టీకే ఎలివేటర్ రికార్డు స్థాయి వార్షిక లాభాలు

వలస ఓటర్లకు అభ్యర్థులు ఫోన్ కాల్స్

Select Suryaa Now
వలస ఓటర్లకు అభ్యర్థులు ఫోన్ కాల్స్

ఆమదాలవలస, అక్టోబర్ 27, మేజర్ న్యూస్ ;ఆమదాలవలస మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లకు ఫోన్ కాల్స్ చేస్తూ పలకరింపులు మొదలుపెట్టారు. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓట్లు సేకరించే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఓటు వేసే సమయానికి పోలింగ్ తేదీకి రావాలని, ప్రయాణ ఖర్చులు అన్ని తామే భరించుకుంటామని అభ్యర్థులు కోరుతున్నారు. మరోవైపు గ్రామాల్లో అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆమదాలవలస మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో గతంలో పదుల సంఖ్య ఓట్ల తేడాతో గెలిచినవారు చాలామంది ఉన్నారు. అప్పటి అనుభవాలు దృశ్య ఎన్నికల్లో గెలుపొందేందుకు వలస ఓటర్లు ప్రధానంగా భావించి, వారి ఓటు ముఖ్యమైనని తెలుసుకొని ప్రస్తుతం ఆప్యాయత పలకరింపులు మొదలుపెట్టారు. ఓటర్లకు ఫోన్ చేస్తూ మామ, అన్న, అక్క, బావ, తమ్ముడు, చెల్లి అంటూ వరసలు కలుపుతూ పలకరిస్తున్నారు. నిన్నటి వరకు గుర్తులేని వలస ఓటర్లు నేడు ఎన్నికల సమయంలో అభ్యర్థులకు గుర్తుకు రావడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ఏది ఏమైనా పోలింగ్ సమయానికి కచ్చితంగా వచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా, ఉపాధి నిమిత్తం ఎక్కడ ఉన్నా ఓటు వేసేందుకు రావాలని, ఇక్కడికి వచ్చేందుకు  తామే ప్రయాణ ఖర్చులన్నీ భరించుకుంటామని తెలియజేస్తున్నారు. మండలంలో సుమారు 38 వేల సంఖ్యలో ఓటర్లు ఉండగా ఇందులో అత్యధికంగా వలస ఓటర్లు సుమారు 5000 వరకు ఉంటారని భావిస్తున్నారు.  అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్న సమయంలో వలస ఓటర్ల ఫోన్ నెంబర్లు సేకరించి వారి వివరాలు సేకరిస్తున్నారు. ఏది ఏమైనా గ్రామాల్లో ఎన్నికల హడావిడి మొదలు కావడంతో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.