BREAKING
గుండారెడ్డిపల్లిలో ఎల్‌ నినో ప్రభావంపై గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్ పిల్లి బాబు స్థానిక ఎన్నికల నామినేషన్లపై ఏపీ హైకోర్టులో పిటిషన్: ప్రతివాదులకు నోటీసులు, విచారణ శుక్రవారానికి వాయిదా ఓవర్సీస్‌ బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డు వసూళ్లు.. విజయ్ దేవరకొండ సంచలనం జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు బెల్ట్ షాపుల నిర్వహణపై సర్పంచ్ ల ఆగ్రహం.... భట్టిప్రోలు మండలంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు బాలల భద్రతకు ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’.. పోక్సో చట్టం, గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌పై 1,650 మందికి పైగా విద్యార్థులకు న్యాయమూర్తుల అవగాహన " అక్రమ కేసులతో అరెస్టులను ఖండిస్తున్నాం - కాకాణి" వి బి జి రామ్ పనులపై శిక్షణ...... అబుదాబిలో ఒకే వేదికపై విజయ్ దేవరకొండ, శిఖర్ ధావన్.. వైరలవుతున్న పిక్స్ రుణం తీర్చుకుంటా అవకాశం కల్పించండి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ అనిరుధ్, కావ్య మారన్ చెన్నై రిసెప్షన్ ఇన్విటేషన్ వైరల్.. ఆ ఒక్క టాలీవుడ్ హీరో ఎవరంటే ఆర్ వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముమ్మరంగా టిడిపి అభ్యర్థుల ప్రచారం అసంఘటిత కార్మికుల హక్కుల పరిరక్షణకు ‘స్వేచ్ఛ రథం’.. వెట్టిచాకిరీ రహిత జిల్లాగా మేడ్చల్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం 20వ వార్డులో పలువురు టిడిపి కార్యకర్తలు వైసీపీలో చేరిక

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్.

Select Suryaa Now
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్.

కళ్యాణదుర్గం: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కళ్యాణదుర్గం రూరల్‌ సీఐ గంగాధర్ కోరారు . ఎన్నికల నేపథ్యంలో ముద్దినాయనిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించి, ఎన్నికల నియమ నిబంధనలు, నేరాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, ఎలాంటి గొడవలు, వివాదాలకు తావివ్వకూడదని సూచించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా, ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు తలెత్తితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామస్థులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసు శాఖకు సహకరించాలని సీఐ పిలుపునిచ్చారు. 

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :-బోయ రంగస్వామి.