20వ వార్డులో పలువురు టిడిపి కార్యకర్తలు వైసీపీలో చేరిక
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని 20వ వార్డుకు చెందిన పలువురు తెలుగుదేశం కార్యకర్తలు మంగళవారం వైసీపీ పార్టీలో చేరారు. ఆత్మకూరు మున్సిపల్ వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, పట్టణ వైసీపీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాపరెడ్డి తదితరుల సమక్షంలో వారు వైసీపీలో చేరారు. వారికి ఇందుమతి, ఆదిశేషయ్య తదితరులు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి, వైసీపీ చైర్ పర్సన్ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి భర్త అల్లారెడ్డి ఆనందరెడ్డి, వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండ వెంకటేశ్వర్లు, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.