వేమవరంలో టీడీపీ అభ్యర్థి మాదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం
వత్సవాయి: వత్సవాయి మండలం వేమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి మాదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ, తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఆమె మమేకమవుతూ, తనకు మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామంలోని ఓటర్లను నేరుగా కలిసి వారి మద్దతును కోరుతున్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి, నంబూరి శ్రీనివాసరావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.