మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమంబాపురం గ్రామంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కనపర్తి, ఆళ్ల, చెముడుగుంట, లఘంతోటి, గడ్డం కుటుంబాలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోవూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరగా, ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పలువురు వైసీపీ నాయకుల హాజరు
ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపసాని పెంచలయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ మహిద్, యువజన విభాగం అధ్యక్షుడు వాకాటి శివకృష్ణ పాల్గొన్నారు. అలాగే రైతు విభాగం అధ్యక్షుడు రాధయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటరమణయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు పులి సాయి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ముక్తియార్‌తో పాటు చైతన్య, విష్ణు, వంశీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.