andhrapradesh
అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ.
సూర్య న్యూస్ అద్దంకి.
జనసేన మరియు కూటమి అభ్యర్థులను గెలిపించాలి: గణిమిశెట్టి శ్రీనివాస నర హరికృష్ణ.
అద్దంకి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఏడు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తోందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గణిమిశెట్టి శ్రీనివాస నర హరికృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో మూడు ఎంపీటీసీ స్థానాల్లో కూటమి మద్దతుతో, మరో నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్రంగా అభ్యర్థులు బరిలో నిలిచారని పేర్కొన్నారు. అదేవిధంగా అద్దంకి మున్సిపాలిటీలో నాలుగు వార్డుల కౌన్సిలర్ స్థానాలకు కూటమి మద్దతుతో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా జనసేన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కూటమి మరియు జనసేన అభ్యర్థులకు ప్రజలు మద్దతుగా నిలిచి, వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా నర హరికృష్ణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అద్దంకి నియోజకవర్గ నాయకులు గోరంట్ల సాయి, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ ఎన్. కాళీ చరణ్, బాపట్ల పార్లమెంట్ కమిటీ సభ్యులు పళ్లపోతుల పూర్ణ, ఈమడాబత్తిన వెంకటేష్, సాధు వెంకటేష్, అచ్యుత కాళీ వరప్రసాద్, ఎం. సాంబ తదితరులు పాల్గొన్నారు.