BREAKING
ఓవర్సీస్‌ బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డు వసూళ్లు.. విజయ్ దేవరకొండ సంచలనం జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు బెల్ట్ షాపుల నిర్వహణపై సర్పంచ్ ల ఆగ్రహం.... భట్టిప్రోలు మండలంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు బాలల భద్రతకు ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’.. పోక్సో చట్టం, గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌పై 1,650 మందికి పైగా విద్యార్థులకు న్యాయమూర్తుల అవగాహన " అక్రమ కేసులతో అరెస్టులను ఖండిస్తున్నాం - కాకాణి" వి బి జి రామ్ పనులపై శిక్షణ...... అబుదాబిలో ఒకే వేదికపై విజయ్ దేవరకొండ, శిఖర్ ధావన్.. వైరలవుతున్న పిక్స్ రుణం తీర్చుకుంటా అవకాశం కల్పించండి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ అనిరుధ్, కావ్య మారన్ చెన్నై రిసెప్షన్ ఇన్విటేషన్ వైరల్.. ఆ ఒక్క టాలీవుడ్ హీరో ఎవరంటే ఆర్ వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముమ్మరంగా టిడిపి అభ్యర్థుల ప్రచారం అసంఘటిత కార్మికుల హక్కుల పరిరక్షణకు ‘స్వేచ్ఛ రథం’.. వెట్టిచాకిరీ రహిత జిల్లాగా మేడ్చల్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం 20వ వార్డులో పలువురు టిడిపి కార్యకర్తలు వైసీపీలో చేరిక మహిళల రక్షణకే మొదటి ప్రాధాన్యత -రాజీవ్ గాంధీ కాలనీ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఈదగాలి గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్, కార్డన్ సెర్చ్

అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు..

Select Suryaa Now
అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు..

పొదలకూరు, మేజర్ న్యూస్ :  అభివృద్ధిని ఆదరించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్‌ చైర్మన్‌ తలచీరు మస్తాన్‌బాబు పిలుపునిచ్చారు. పొదలకూరు మండలం అంకుపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌.వై.పాలెం ఎంపీటీసీ అభ్యర్థి మైలా కోటేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మస్తాన్‌బాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆదరించాలని కోరారు. సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనలో సోమిరెడ్డి కృషి చేశారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఇంటింటికీ వెళ్లి మద్దతు కోరిన అభ్యర్థులు

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. గ్రామంతోపాటు ఎస్సీ కాలనీలోనూ పర్యటించి ఓటర్లతో మమేకమయ్యారు. కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరుతూ ఎన్నికల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రచార సమయంలో గ్రామస్థులు అభ్యర్థులకు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు పులిపాటి వెంకటరత్న నాయుడు, సర్వేపల్లి జనసేన నాయకుడు నారదాసు రవి, కోడూరు పెంచల భాస్కర్‌రెడ్డి, పెంచల నాయుడు, ఆవులపాటి పిచ్చినాయుడు, నాగినేని పెంచల సుబ్బానాయుడు, నాగినేని ప్రభాకర్‌నాయుడు, కొప్పాల రాఘవులు, మోహన్‌, గూడపాటి కృష్ణమూర్తి, వేంకటరమణయ్య, అత్తెన శ్రీనివాసులు, అడసనపల్లి పెంచలయ్య, యాదాల కోటి, రాపూరు రత్నం, పంతగిరి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.