BREAKING
ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు...అధ్యక్ష బరిలోకి లె పెన్ తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కొత్త సినిమా కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా థేమ్స్ నది తీరంలో ఆగిపోయిన నిర్మాణాలు సమావేశానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానించిన జేఏసీ నేతలు

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై అవగాహన ర్యాలీ.

Select Suryaa Now
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై అవగాహన ర్యాలీ.

పాలకొల్లు, మేజర్ న్యూస్  రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకొల్లు ఉల్లంపర్రు మాంటిస్సోరీ పాఠశాల వద్ద అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు అధ్యక్షుడు గుడాల హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలియో నిర్మూలన ఆవశ్యకతను వివరించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు గుడాల హరిబాబు మాట్లాడుతూ పోలియో వ్యాధి నిర్మూలన కోసం రోటరీ క్లబ్ గత 40 సంవత్సరాలుగా ఎనలేని కృషి చేసిందని తెలిపారు. ఈ కృషి ఫలితంగా చిన్నారుల్లో పోలియో కారణంగా వచ్చే అంగవైకల్యాన్ని అరికట్టడంతో పాటు దేశాన్ని పోలియో రహితంగా నిలిపేందుకు విశేషంగా తోడ్పడిందని పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్‌కమింగ్ గవర్నర్ డాక్టర్ ముచ్చర్ల సంజయ్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణంలో రోటరీ క్లబ్ అందించిన సేవలు అభినందనీయమని వివరించారు. జిల్లా యువ రోటరీ అవార్డు కమిటీ అధ్యక్షుడు మద్దాల వాసు మాట్లాడుతూ పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ రోటరీ క్లబ్‌కు పోలియో నిర్మూలన నిధులు అందించి ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించాలని కోరారు.అవగాహన కార్యక్రమం అనంతరం ర్యాలీ నిర్వహించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో సహాయ గవర్నర్ మైగాపుల రాంబాబు, కోశాధికారి ఆరుమిల్లి సురేష్, మాజీ అధ్యక్షులు ఇమ్మిడి రాజేష్, రావాడ సతీష్, ముత్యాల శ్రీవత్సవప్రదీప్, కానూరి ప్రభాకర్ రావు, చిలుకూరి భీమన్న, ఉపప్రధానోపాధ్యాయురాలు వసంతలక్ష్మి, ఏఎన్‌ఎం భాగ్యలక్ష్మి, ఆరోగ్య సహాయకుడు బి. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.