ఆరోగ్య నెల్లూరే లక్ష్యం.. డివిజన్ల వారీగా పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ : ప్రజలు తమ ఇళ్లకు సమీపంలోనే నడక, వ్యాయామం చేసుకునేలా డివిజన్ల వారీగా పార్కులు, వాకింగ్ ట్రాక్‌లను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 'చెప్పాం.. చేస్తున్నాం' కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియాన్ని సందర్శించి, వాకర్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, 45వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి చిత్తులూరి సుందర్రామిరెడ్డి, ఇతర కూటమి నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ ప్రతినిధుల అభిప్రాయాలను ఎంపీ గారు తెలుసుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యం.. పార్కుల అభివృద్ధికి భారీగా నిధులు నెల్లూరు ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందని ఎంపీ అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మంత్రి గారి చొరవతో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంతో పాటు నగరంలోని పలు పార్కులను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, నడకకు అనువైన మార్గాలు, వ్యాయామ సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో రహదారులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకత్వం కూటమిది ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడిగా రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిలిచారని ఎంపీ ప్రశంసించారు. మంత్రి శ్రీ పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సేవలందిస్తున్నారన్నారు. నగర అభివృద్ధి, మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కూటమి నాయకత్వం పనిచేస్తోందని పేర్కొంటూ, ప్రజల సమస్యలపై నిరంతరం స్పందించే ఈ నాయకత్వాన్ని ఆదరించాలని కోరారు.
అనుభవజ్ఞుడైన రూప్ కుమార్ యాదవ్‌కు అవకాశం కల్పించండి నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ, పాలనపై అవగాహన ఉన్న నాయకత్వం అవసరమని ఎంపీ అన్నారు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్, ఇన్‌చార్జి మేయర్ వంటి హోదాల్లో పనిచేసిన శ్రీ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌కు పరిపాలనా అనుభవం ఉందని, అది నగరాభివృద్ధికి ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి మేయర్ అభ్యర్థి శ్రీ రూప్ కుమార్ యాదవ్‌ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, 72 మంది కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను ఆదరించాలని ఎంపీ గారు విజ్ఞప్తి చేశారు.