BREAKING
ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు...అధ్యక్ష బరిలోకి లె పెన్ తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కొత్త సినిమా కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా థేమ్స్ నది తీరంలో ఆగిపోయిన నిర్మాణాలు సమావేశానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానించిన జేఏసీ నేతలు

రోడ్ల నుంచి పాఠశాలల వరకు.. అభివృద్ధే మా అజెండా: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

Select Suryaa Now
రోడ్ల నుంచి పాఠశాలల వరకు.. అభివృద్ధే మా అజెండా: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   నెల్లూరు నగరంలో విశాలమైన రహదారులు, ఆహ్లాదకరమైన పార్కులు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ఆధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి   తెలిపారు. కూటమి ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో చేసిన పనులను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని కూటమి నాయకులు, అభ్యర్థులకు పిలుపునిచ్చారు. నగరాభివృద్ధికి మంత్రి శ్రీ పొంగూరు నారాయణ,  నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి   చేస్తున్న కృషిని ప్రశంసించారు. సోమవారం నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి   నివాసంలో కూటమి నాయకులు, అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర గారు, జనసేన నేత, టిడ్కో ఛైర్మన్‌ శ్రీ వేములపాటి అజయ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ వంశీ, మేయర్‌ అభ్యర్థి శ్రీ పోలుబోయిన రూప్‌ కుమార్‌ యాదవ్‌ గారు, 72 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల కార్యాచరణపై ఎంపీ గారు దిశానిర్దేశం చేశారు.

ఇంటింటికీ వెళ్లండి.. పనులతో పాటు భవిష్యత్తు ప్రణాళికనూ చెప్పండి    నగరంలో జరిగిన అభివృద్ధితో పాటు రానున్న రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాల గురించి కూడా ప్రజలకు తెలియజేయాలని ఎంపీ  సూచించారు. ప్రతి డివిజన్‌లో ప్రజలను నేరుగా కలిసి, వారి అవసరాలు తెలుసుకుంటూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించాలన్నారు.

విశాల రహదారులు.. పార్కులు.. మారుతున్న నెల్లూరు రూపురేఖలు   నగరంలో రహదారుల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రజల రాకపోకలకు అనుకూలంగా విశాలమైన రోడ్లు నిర్మిస్తున్నామని ఎంపీ   తెలిపారు. గతంలో వాకింగ్‌, రన్నింగ్‌కు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియమే ప్రధాన ఆధారంగా ఉండేదని, ఇప్పుడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాకింగ్‌, రన్నింగ్‌ పార్కులు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి   పట్టుదలతో పనిచేస్తూ ఈ పనులను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు.. దోమల నివారణకు చర్యలు   నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం, దాతల సహకారంతో ఆధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నామని ఎంపీ  తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన విద్యా వాతావరణం అందించేందుకు అవసరమైన సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దోమల సమస్యను తగ్గించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు క్లోజ్డ్‌ డ్రెయిన్ల నిర్మాణం వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

రూప్‌ కుమార్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వండి  కూటమి మేయర్‌ అభ్యర్థి శ్రీ పోలుబోయిన రూప్‌ కుమార్‌ యాదవ్‌ 2005 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ కార్పొరేటర్‌, డిప్యూటీ మేయర్‌, ఇన్‌చార్జి మేయర్‌గా పనిచేశారని ఎంపీ  గుర్తుచేశారు. నగరాభివృద్ధి ప్రణాళికలను సమర్థంగా అమలు చేసేందుకు ఆ అనుభవం ఉపయోగపడుతుందని, మేయర్‌తో పాటు అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.

మూడు పార్టీలు.. ఒకే లక్ష్యం   కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి ప్రజల వద్దకు వెళ్లాలని ఎంపీ  పిలుపునిచ్చారు. మేయర్‌ అభ్యర్థి శ్రీ రూప్‌ కుమార్‌ యాదవ్‌తో పాటు 72 మంది కూటమి కార్పొరేటర్‌ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సైకిల్‌, గాజు గ్లాస్‌, కమలం గుర్తులపై ఓటు వేసి వారిని గెలిపించాలని నెల్లూరు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.