BREAKING
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ కోసం మెటా భారీ స్టాక్ ఆఫరింగ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై అవగాహన ర్యాలీ. కొడవలూరులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి కీలక వైసీపీ నాయకులు వాల్మీకి జయంతి వేడుకల్లో డిఎన్ మూర్తి లండన్ లోని ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ వీధిలో బస్సులు, వాహనాల రాకపోకలపై నిషేధం స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ఆర్.వసంతకుమారి ప్రచారానికి విశేష ఆదరణ...! ఆరోగ్య నెల్లూరే లక్ష్యం.. డివిజన్ల వారీగా పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా టీ-షర్టుల బహుకరణ.. కళాకారులను ఆదుకోవాలి - తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ నేతల ముందడుగు ఎన్నికల ప్రచారంలో రోడ్ల నుంచి పాఠశాలల వరకు.. అభివృద్ధే మా అజెండా: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కల్లూరు అర్బన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం.. 37, 38, 39వ వార్డుల్లో కాటసాని విస్తృత ప్రచారం. దూసుకుపోతున్న వైసిపి ప్రచారం! పోలాండ్-జర్మనీ అంతరిక్ష సహకారం..భద్రత, సాంకేతికతపై ప్రత్యేక దృష్టి జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల రోడ్ షో

*గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి*

Select Suryaa Now
*గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి*

*ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్*

మధిర, సూర్య మేజర్ న్యూస్:

రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థి నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయకుమార్, తలుపుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి నూతి సత్యనారాయణ గౌడ్ తో పాటు మధిర నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల ఇంచార్జ్ పొట్ల నాగేశ్వరరావుహాజరయ్యారు. ఈ సందర్భంగా  సత్యనారాయణ గౌడ్  మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రతి డివిజన్ పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్లు తమకు కేటాయించిన బూత్‌లలో ఉన్న పట్టభద్రులను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి అర్హుడికి సమాచారం అందించి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

సీతారాం…సూర్య