BREAKING
ఉక్రేనియన్ దళాల విరుచుకుపడుతున్న దాడి..ఒలేష్కీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను కుటుంబం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం - ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ కోసం మెటా భారీ స్టాక్ ఆఫరింగ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై అవగాహన ర్యాలీ. కొడవలూరులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి కీలక వైసీపీ నాయకులు వాల్మీకి జయంతి వేడుకల్లో డిఎన్ మూర్తి లండన్ లోని ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ వీధిలో బస్సులు, వాహనాల రాకపోకలపై నిషేధం స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ఆర్.వసంతకుమారి ప్రచారానికి విశేష ఆదరణ...! ఆరోగ్య నెల్లూరే లక్ష్యం.. డివిజన్ల వారీగా పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా టీ-షర్టుల బహుకరణ.. కళాకారులను ఆదుకోవాలి - తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ నేతల ముందడుగు ఎన్నికల ప్రచారంలో రోడ్ల నుంచి పాఠశాలల వరకు.. అభివృద్ధే మా అజెండా: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కల్లూరు అర్బన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం.. 37, 38, 39వ వార్డుల్లో కాటసాని విస్తృత ప్రచారం.

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి.

Select Suryaa Now
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి.

సంగారెడ్డి, :- ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.సోమవారం  కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సంగీతతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలని, సమస్యకు సంబంధించిన వివరాలను నిర్ధారించుకుని నిబంధనల మేరకు పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో అనవసర జాప్యం చేయకుండా, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 49 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో సంగారెడ్డి డివిజన్ కు 9, నారాయణఖేడ్ డివిజన్ కు 2, జహీరాబాద్ డివిజన్ కు 3 ఫిర్యాదులు అందగా,కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కి 35 ఫిర్యాదులు అందాయని,అందోల్ డివిజన్ నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.