BREAKING
ఉక్రేనియన్ దళాల విరుచుకుపడుతున్న దాడి..ఒలేష్కీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను కుటుంబం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం - ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ కోసం మెటా భారీ స్టాక్ ఆఫరింగ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై అవగాహన ర్యాలీ. కొడవలూరులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి కీలక వైసీపీ నాయకులు వాల్మీకి జయంతి వేడుకల్లో డిఎన్ మూర్తి లండన్ లోని ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ వీధిలో బస్సులు, వాహనాల రాకపోకలపై నిషేధం స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ఆర్.వసంతకుమారి ప్రచారానికి విశేష ఆదరణ...! ఆరోగ్య నెల్లూరే లక్ష్యం.. డివిజన్ల వారీగా పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా టీ-షర్టుల బహుకరణ.. కళాకారులను ఆదుకోవాలి - తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ నేతల ముందడుగు ఎన్నికల ప్రచారంలో రోడ్ల నుంచి పాఠశాలల వరకు.. అభివృద్ధే మా అజెండా: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కల్లూరు అర్బన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం.. 37, 38, 39వ వార్డుల్లో కాటసాని విస్తృత ప్రచారం.

ప్రేమ్ నగర్ పాఠశాలను వెంటనే పునః ప్రారంభించాలి-విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయుడు లేక మూత... ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మౌర్య

Select Suryaa Now
ప్రేమ్ నగర్ పాఠశాలను వెంటనే పునః ప్రారంభించాలి-విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయుడు లేక మూత... ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మౌర్య

మహా ముత్తారం, మేజర్ న్యూస్,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని ప్రేమ్‌నగర్ ప్రాథమిక పాఠశాలను వెంటనే పునఃప్రారంభించి, ఉపాధ్యాయుడిని నియమించాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మౌర్య డిమాండ్ చేశారు. ఈ మేరకు భూపాలపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
పాఠశాలలో విద్యార్థులు ఉన్నప్పటికీ, ఉపాధ్యాయుడిని మరో పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించడంతో ఈ ఏడాది జూన్‌ నుంచి పాఠశాల మూతపడిందని తెలిపారు. దీంతో ప్రేమ్‌నగర్‌కు చెందిన పేద గిరిజన విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను పునఃప్రారంభించడంతోపాటు ఉపాధ్యాయుడిని కేటాయించాలని పీక కిరణ్ మౌర్య, ఐతే బాపు కోరారు.

రిపోర్టర్: మహ ముత్తారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా