పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు.
సంగారెడ్డి : పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా, సోమవారం సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ హైస్కూల్, శాంతినగర్‌లో పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.పోలీసు అధికారులకు “పౌరుల మన్ననలు పొందేందుకు పోలీసులు చేయాల్సిన కృషి, కింది స్థాయి పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం” అనే అంశంపై మరియు పోలీసు సిబ్బందికి “ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుంచి ఎలాంటి సేవలను ఆశిస్తున్నారు?”, “పోలీసు అధికారుల జీవితాల్లో సోషల్ మీడియా పాత్ర – దాని వ్యసనాన్ని అధిగమించి వ్యక్తిగత, సామాజిక ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవడం ఎలా?” అనే అంశాలపై పోటీలు నిర్వహించారు.ఈ పోటీలకు మొత్తం 34 మంది హాజరయ్యారని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్, తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడు వ్యాసాలను రివార్డుల కోసం ఎంపిక చేయడంజరుగుతుందన్నారు.అదేవిధంగా, విద్యార్థినీ విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న వ్యాసరచన పోటీల్లో సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర”, “సైబర్ నేరాల నివారణలో పోలీసులు, పౌరుల పాత్ర”, “డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర – విద్యార్థులు మాదకద్రవ్యాలకు ఎలా దూరంగా ఉండగలరు?” వంటి అంశాలపై రాసిన వ్యాసాలను పరిశీలించి, ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి విజేతలకు రివార్డులు అందజేయనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.