వెల్దుర్తిలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: మండల కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్యవైశ్య నాయకుడు తిరువీధి రమేష్ ఆధ్వర్యంలో తిరువీధి డాక్టర్ రాంప్రసాద్, తిరువీధి సురేంద్ర కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జై వాల్మీకి అంటూ నినాదాలు చేశారు.కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు, సభ్యులు, ప్రముఖులు పరస్పరం పూలమాలలు వేసి, కండువాలు కప్పి సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా తిరువీధి రమేష్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. వేడుకలకు హాజరైన వాల్మీకి సోదరులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు, పెద్దలు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం