BREAKING
కొమురం భీమ్ ఆశయాలను సాధించాలి ఈజీజెట్ విమానాల్లో స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు "సర్వేపల్లి లో వై కా పా లోకి వరస చేరికలతో చతికిలపడ్డ టి డి పి " సూర్యని పొగడ్తల్లో ముంచెత్తిన నటి నజ్రియా నాజిమ్ కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* లాభాల బాటలో లండన్ మార్కెట్ ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ ఆధ్యాత్మిక శోభతో సత్యనారాయణ స్వామి ఆలయం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు కార్పొరేట్ రుణాల ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...డాయిష్ బ్యాంక్ కీలక అడుగు 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన నాయకుల విస్తృత ప్రచారం! అర్నబ్' ముప్పుపై యంత్రాంగం అప్రమత్తం ఫెడెక్స్ నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జమేర్ జాక్సన్ నియామకం ఖేత్ బచావో అభియాన్‌లో రైతులకు అవగాహన ఒలేష్కీ నుంచి వలస వెళ్లిన ఉక్రెయిన్ వాసుల్లో అమెరికా మధ్యవర్తిత్వ కాల్పుల విరమణపై తీవ్ర సందేహాలు కొత్త కుళాయి చెరువు సుందరీకరణకు రూ.5.60 కోట్లు త్వరలో ప్రతి రెండు వార్డులకు ఒక పార్కు 14 కోట్ల నిధులు మంజూరు.

వినూత్నంగా సాగు చేయటం అలవాటు చేసుకోవాలి : సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి .టి.విజయ్ కుమార్

Select Suryaa Now
 వినూత్నంగా సాగు చేయటం అలవాటు చేసుకోవాలి : సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి .టి.విజయ్ కుమార్

ఒంగోలు : 

      ఏకకాలంలో వివిధ పంటలను వినూత్నంగా సాగు చేయటం అలవాటు చేసుకోవాలని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ.టి.విజయ్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. సోమవారం ప్రకాశం భవనంలో ప్రకృతి సాగు రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనాకుమారిలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఎల్నినో నేపథ్యంలో రైతులకు ఆదాయం రావడంతో పాటు జిల్లాలో పశుగ్రాసానికి కొరత లేకుండా ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. ప్రస్తుత పంటలలో అంతర పంటలను కూడా పెంచడం ద్వారా ఈ లక్ష్యాలను చేరుకోవచ్చు అన్నారు. ఈ క్రమంలో భూ సారాన్ని క్రమంగా తెలుసుకుంటూ సేంద్రియ ఎరువులను ఉపయోగించాలని ఆయన సూచించారు. సాగు చేయకుండా వదిలేసిన బంజరు భూములను ప్రకృతి సేద్యం విధానం ద్వారా వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా వాతావరణంలో ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గించవచ్చన్నారు. ప్రకృతి సంబంధిత ఎల్ నినో ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు ప్రకృతి సేద్య విధానమే ఉత్తమమని విజయ్ కుమార్ చెప్పారు. ఈ దిశగా రైతులను మరింత చైతన్యవంతం చేసేలా ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేసేలా చూస్తానన్నారు.        కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పంటల సాగు తీరు, ప్రకృతి సేద్యం జరుగుతున్న విధానాన్ని వివరించారు. ప్రకృతి సేద్య విస్తీర్ణం మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటామని, అంతర పంటల ప్రాధాన్యాన్ని విస్తృతంగా రైతుల్లోకి తీసుకువెళ్లేలా మరింత దృష్టి సారిస్తామని చెప్పారు.   ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ప్రకృతి సేద్యం డిపిఎం సుభాషిణి, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.