వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం... గుజ్జుల..!
వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం... గుజ్జుల..!
- పట్టణంలో భక్తిశ్రద్ధలతో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..!
- వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఆయన చూపిన మార్గంలో నడుస్తూ మహర్షి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జుల గౌరీశ్వర నాయుడు తెలిపారు. సోమవారం పట్టణంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, వైష్ణవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రవీంద్రబాబు, శేఖర్, పిక్కిలి వెంకటేశ్వర్లు, మండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి కేవలం ఒక మహాకవి మాత్రమే కాకుండా, ప్రపంచానికి ధర్మం, సత్యం, నీతి, మానవతా విలువల గొప్పతనాన్ని చాటిచెప్పిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన రచించిన రామాయణ మహాకావ్యం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తూ, మానవ జీవన విధానానికి విలువైన సందేశాన్ని అందిస్తోందని తెలిపారు. మహర్షి వాల్మీకి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంతోపాటు విద్య, సామాజిక అభివృద్ధి, ప్రజాసేవకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, ఆయన బోధించిన ఆదర్శాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని ఆకాంక్షించారు. మహర్షి వాల్మీకి ఆశయాల స్ఫూర్తితో సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.