కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
ఒంగోలు: ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఒంగోలు టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్పను, నగరపాలక సంస్థ పరిధిలోని కూటమి బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సోమవారం ఉదయం ఒంగోలు నగరంలో టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్పతో కలిసి ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్ధన్ గారు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని 14, 15, 16, 29, 30, 31, 32వ డివిజన్ల పరిధిలోని రైలు పేట, క్లౌపేట, కబాడిపాలెం, రంగు తోట, మరాఠీపాలెం, మిరియాలపాలెం, గానుగపాలెం, కోట వీధి, బండ్లమిట్ట నంది సర్కిల్, పర్వతమ్మ గుడి సెంటర్, వడ్డెపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గారు, మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీ శిల్ప ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పలు ప్రాంతాల్లో ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, నగర అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్పను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ముప్పిరి ముత్యాల రాణి, 15వ డివిజన్ అభ్యర్థి నండూరి లక్ష్మి ప్రసన్న, 16వ డివిజన్ అభ్యర్థి గొర్రెముచ్చు దీప్తి, 29వ డివిజన్ అభ్యర్థి షేక్ మున్వర్ భాష, 30వ డివిజన్ అభ్యర్థి కరేటి మాధవి, 31వ డివిజన్ అభ్యర్థి వలివేటి పవన్, 32వ డివిజన్ అభ్యర్థి గాజుల వెంకట సుప్రజ పాల్గొన్నారు. వీరితో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేశారు…