BREAKING
ప్రతి ఏటా శారీరక, మానసిక హింసకు గురవుతున్న 100 కోట్ల మంది పిల్లలు విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆత్రేయపురం మండలం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాస్ పందిరిపల్లిగూడెం ఎంపీటీసీగా పద్మాదేవిని ఏకగ్రీవం అభిషేక్ శర్మ వీరంగం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం! *రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శ్రీనిధి విద్యార్థుల ఎంపిక* జనాభా గణన వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెంకన్న సన్నిధిలో ఎలక్షన్ జిల్లా అధికారి ప్రశాంతి ప్రత్యేక పూజలు విరువూరులో వైసీపీ ప్రచార హోరు కాకాణి నాయకత్వంలో విజయమే లక్ష్యంగా ముందుకు.. వాతావరణ మార్పుల నిధులకు నిధుల కొరత లేదు విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు నేరడిగొండ విద్యార్థి జీ విద్య వర్ధన్ ఎంపిక గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో సాంకేతిక అస్థిరత ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన 15వ రోజుకు చేరుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మె - ఉద్యోగులను ఆదుకోవాలని మంత్రి సీతక్కకు వినతి

మార్కాపురంలో జిల్లా ప్రజాప్రతినిధుల కీలక భేటీ

Select Suryaa Now
మార్కాపురంలో జిల్లా ప్రజాప్రతినిధుల కీలక భేటీ

మార్కాపురం, మేజర్‌ న్యూస్‌ :
స్థానిక మార్కెట్ యార్డులో జిల్లా ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ బీటీ.నాయుడు గారి అధ్యక్షతన జిల్లాలోని కూటమి ప్రజాప్రతినిధుల సమన్వయ సమావేశం జరిగింది..ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు,గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు,ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక తదితర కీలక అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కూటమి నేతలంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.